తన ఉనికికి ఆది
తండ్రిని ప్రేమించడం
తన నిలకడకు నాంది
గురువుని ప్రేమించడం
తన మనుగడకు నాంది
తోటివారిని ప్రేమించడం
తన సంతోషానికి తొలి సూత్రం
తరుణంలో తరుణీ తరుణుల
ఆకర్షణను మించి కలిగే ప్రేమ
అభౌతిక అలౌకిక
అత్యున్నత భావన
ఆవిష్కరణం
ప్రతి మనిషికి ప్రేమ కావాలి
ప్రతి దశకి ఒక ప్రేమ కావాలి
అలలు లేని సముద్రంలా
కదలలేని హిమాలయంలా
కదలనివ్వక నిలిపే ప్రేమ
కంటిచూపు కావ్యం
మధ్య రాత్రిలోని మెరుపు
ప్రేమ అమృతం
అనృతం కలిస్తే అది విషం
ప్రేమ స్వార్థానికి పరాకాష్ఠ
తన్ని తాను ప్రేమించుకొనే మనిషి
అంతర్భాగంగా సమాజాన్ని ప్రేమిస్తే రుషి
0 వ్యాఖ్యలు:
Post a Comment