
ఆకాశం
సృష్టికి అవకాశం
ఆకాశం
జీవి చరించడానికి ఒక జాగా!
ఆకాశం
జీవి జీవన క్రియలు జరగడానికీ ఓజాగా
‘వాత’రూపంలో ఆకాశం
విశ్వమంతా ఆకాశం
స్థూల సూక్ష్మ రూపాల్లో ఆకాశం
గ్రహగతులు నిర్దేశించే ఆకాశం
గ్రహాంతరాళాల్లో ఆకాశం
భగవంతుని స్థానం, బ్రహ్మ సృష్టి ఆకాశం
నీలకంఠమైన ఆకాశం
నీలిమేఘమైన ఆకాశం
నీరు నిప్పు నిచ్చే ఆకాశం
నిజం !సృష్టి గొప్పదనం ఆకాశం
0 వ్యాఖ్యలు:
Post a Comment