Thursday, May 14, 2009

బిజీ

Thursday, May 14, 2009
ఆద్యంతాలు తెలియని
జీవన ప్రయాణంలో
ఏదో సాధించాలని
శోధించాలని
సుఖించాలని
సుఖపెట్టాలని
తనదైనముద్ర
ఈలోకంలో మిగల్చాలని
పడుతూ లేస్తు
ముక్కుతూ మూల్గుతూ
ఓపిక తెచ్చుకొంటూ
ఉస్సూరనుకుంటూ
హుషారు తెచ్చుకొంటూ
వ్యక్తిగా, శక్తిగా
విద్యార్థిగా శ్రామికుడిగా
తల్లిగా, తండ్రిగా;
అనేక రూపాల్లో
అనేక రూపాల్తో
నిత్య ప్రయణమే బిజీ
ఈ బిజీ కడవరకూ బిజీయే!




0 వ్యాఖ్యలు: