గజిబిజీయే!
కనీసం ఒక్క క్షణం కూడా కానిమనం
రెండర్ధకణాల కలయికైన మనం
ఎక్కడో ఊపిరిపోసుకొని
మరెక్కడో శక్తి రగిలించుకొని
ఎక్కడో జ్ఞానాన్ని ప్రోది చేసికొని
మరెక్కడో గమ్యాన్ని నిర్దేశించుకొని
ఈ ప్రపంచ ప్రయాణంలో
సహస్ర నేత్రాలూ
శతసహస్ర బాహువుల కదలికల్తో
అనంతమైన అన్వేషణలో
వ్యక్తిగా, మానవ
శక్తిగా, సమిష్టిగా
చేసే సంచారం; అదే
విరాట్పురుషుని మహారూపం, గజిబిజి
అంతరాళాల్లోపని సూక్ష్మవ్యక్తి
వామనుడికి మాత్రం
ఈ గజిబిజీ ఓ అపసవ్యం
బిజిగజీ ఓ అపహాస్యం
0 వ్యాఖ్యలు:
Post a Comment