కాలం
విధి విసరిన గాలం
విలయ మహేంద్ర జాలం
ఎవ్వరి సొత్తూ కానిది కాలం
రాజ్యాన్ని ఏలిన రాజుల్ని సయితం
క్షణాల్లో మట్టిపాలు చేసింది కాలం
యథార్థాన్ని పదార్థంగా
పదార్థాన్ని యథార్థంగా
సాపేక్షించేది కాలం
కలికాలంలో కూడా
కలత చెందందే కాలం,
బిడ్డల్ని బళ్ళుగానూ
బళ్ళల్ని ఓడలుగానూ మార్చేసేకాలం
నీకూ, నాకూ
మనందరికీ ఏదో ఒక రోజు
‘మనది’ చేసే కాలం
మనం చూసేదేకాలం.
Subscribe to:
Post Comments (Atom)
0 వ్యాఖ్యలు:
Post a Comment