Thursday, May 14, 2009

తీరం

Thursday, May 14, 2009



తీరం!
చేరకపోతే, ఘోరం!
ఆశ!
నెరవేరకపోతే పాపం!
బాధ,
మరువకపోతే నేరం!
తీరం
వెంబడి జీవనం
తీరం
వెంబడి సంస్కృతి
మానవ మనుగడలో
విడివడని బంధం తీరం
మానవ నడవడిని
నిలకడగా ఉంచిందీ తీరం;
తీరం జీవనాధారం
జీవన్మరణ సూత్రం
సుఖఃదుఖాఃల ద్వంద్వ ద్వారం
తీరం చేరడమే గమ్యం




0 వ్యాఖ్యలు: