పాంచ భౌతిక ప్రపంచం
విశ్వం విశ్వాక్షం విశ్వసంభవం అయినా
మనకు మాత్రం భూమే సర్వ ప్రపంచం
ఎల్లలెరుగని భూమ్యాకాశాలకి
ఎల్లలేర్పరచి
జాతులు, మతాలుగా విభజించి
ప్రేమకూ, బ్రతుకుకూ
బంది భావాలేర్పరచి
ఇదిగో ఇక్కడ బ్రతకండిరా!
ఇదీ మీ ప్రపంచం అన్న శాసనానికి
అశక్తులుగా జీవనాన్ని వెళ్ళదీసిన
మానవజాతి
నేడు బందిభావాల్ని తెంచుకొని
ఆబంధనాల్నే అభయబంధనాలుగా మార్చుకొని
దేశాలుగా పిల్చుకొని
జీవనం చేసే ప్రపంచమే
నా ప్రపంచం...
చేపకీ, పక్షికీ, మృగానికీ లేని ఎల్లలు; భక్తులు
మనిషినైన నా కెక్కడినుండి వచ్చాయో
నాకు తెలియదు
వసుధైక కుటుంబం
విశ్వమానవ ప్రేమ
ఎల్లలెరుగని భౌగోళిక స్థితి
ఎక్కడుంటుందో
అదే నా అసలు
ప్రపంచం
లేచిపోయిన పెళ్ళాం
దోచుకెళ్ళిన ధనం,
కుదేలైన వ్యాపారం,
మోసగించే చట్టం,
పతకాన్ని సూచిస్తుంటే మానవ
సంబంధాల్ని చెడుగొడుతుంటాయి.
0 వ్యాఖ్యలు:
Post a Comment