మనోవేగం
ఎక్కడో ఎపుడో
స్థలంగా వీచేగాలి
నేడు ఊపందుకొంది
వేగానికి ప్రతీక వాయువు
స్పర్శ మాత్రంగానే
శక్తినందించే మహాశక్తి వాయువు
బాహ్యం నుండి నేరుగా
రక్తనాళాల్లోకి చేరుకొనే
ఏకైక శక్తి వాయువు
అద్వితీయమైన స్పందన ఊపిరి,
ప్రాణవాయువుల్ని
నవనాడుల్లోకి పంపి
జీవిని చైతన్యం చేసే శక్తి వాయువు
జలాల్లో సయితం మిళితమైన వాయువు
జీవజాతుల్ని పోషించే ఆయువు
పంచభూతాల్లో జీవించి,
ప్రపంచాన్ని శాసించి,
జీవనాడుల్ని పలికించే వేణువు
0 వ్యాఖ్యలు:
Post a Comment