
జలం
జీవ జాతుల బలం
జనం
జీవనం జలం
జీవన జలం
సుజలాం
సుఫలాం
మానవజాతి దృఢంగా
నిశ్చయంగా
ఒక్కటిగా సంస్కృతిగా
నిలవడానికి
కారణం
నదీ! నీరూ!
బొట్టు బొట్టుగా మొదలై
చుట్లు చుట్లుగా
సుళ్ళు తిరిగి
సెలయేళ్ళు యేళ్ళుగా పారి
ఫెళ్ళుమని జలపాతాలుగా విరిగి
నదులై, సరస్సులై
సాగరాలై, సర్వస్వమైన
జలం
సృష్టికి
భుజబలం
0 వ్యాఖ్యలు:
Post a Comment