‘గతమెంతో ఘనకీర్తి కలవాడా!’ అని నాటి మన కీర్తిని నేడు పాడుకోవడమే, నేటి మన కీర్తిలో ముఖ్యభాగంగా కనబడుతుంది. ప్రతిరోజు ‘ఇంటర్ నెట్లో’ వస్తున్న తెలుగు ‘వెబ్ పేజీలు’ లో ముఖ్యంగా మీ దినపత్రిక (‘ఉన్నమాట’ వంటి విశేష విశ్లేషణ ఉన్న వ్యాపార కారణంగా) చదువుతాను. ‘నేటి మన కీర్తి’ ఏమిటి అన్న ప్రశ్న భూతద్దంగా చేసుకుని వెతుకుతూ ఉంటాను. భూతద్దం ఎందుకు? ఏడు కోట్ల మంది తెలుగువారిలో లక్షకి ఒక్కరైనా తెలుగువారిని కీర్తి పతాకాన్ని ఎగరవేసే లక్షణమైన పని ఒక్కటైనా చేసినట్లయితే మనం భూతద్దాలు వాడనక్కరలేదు. లక్షణమైన పని అంటే ఏమిటి? తనకు తనవారి శ్రేయస్సు, యశస్సుల కొఱకు మాత్రమే కాక, పదిమందికి ఉపయోగపడేది, మానవత్వాన్ని ప్రతిబింబించే పని, కానీ అలాంటివి అంత ఎక్కువగా జరగడం లేదు. కానీ అక్కడక్కడ, అప్పుడప్పుడు జరుగుతున్నాయి. అందుచేత అవి మిగిలిన నానా రకాల విషయాల మధ్య మఱుగున పడుతున్నాయి. కాబట్టి వాటిని చూడడానికి భూతద్దాలు వాడాలి. అందుకే కనిపించేది లేశమైనా, వీశెడుగా భావించి ఆనందిస్తాను. లేశమైనా, వీశెడు అని ఎందుకనుకోవాలి? అనుకుని ఎందుకు ఆనందించాలి?
అప్పుడప్పుడు నేను తెలుగు నాట తిరిగినప్పుడు నా అంతట నేను చూసి, అనుభవించిన సామాన్యుని జీవితం, మిత్రులు నాతో పంచుకున్న వారి అనుభవాలు, వార్తాపత్రికలు అందించే వర్తమాన చరిత్ర వివరాల వలన తెలుగు నాట నేడు తెలుగువాడు లక్షణమైన పనులు చెయ్యడం అతికష్టమైన విషయం అన్నది స్పష్టం. అందుకే అది లేశమైనా వీసెడుగా భావిస్తాను. అంతేకాక కీర్తి సంపాదించే మార్గంలోనే మనం ఉన్నామని, మిల్లీమీటరు మాత్రమే ముందుకి వెళుతున్నా అది ముందుకి వెళ్ళడమే, ప్రగతేనని ఆనందిస్తాను.
లక్షణమైన పని చెయ్యడం ఎందుకు అంత కష్టం? ఈ ప్రశ్న మీకూ వచ్చిందా? నేడు తెలుగు నాట ఉన్న రాజకీయ, ఆర్థిక మరియు సామాజిక పరిస్థితుల మధ్య బ్రతుకుతున్న తెలుగువాడి దైనందిన జీవితాన్ని ఒకసారి పరిశీలించండి. ఉదయం మేలుకొనే వరకు (ఉండీ ఉండని కరెంటు, వచ్చిపోనీ దోమలు, అవి తెచ్చిచ్చే జబ్బులు, వరల్డ్ బేంక్ వాళ్ళు మన దారిద్ర్యాన్ని మనకి తెలియని లెఖ్ఖల్లో కట్టిచ్చే అప్పులు... మొదలైనవిః ప్రభుత్వం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పౌరుల జీవితాలని నియంత్రిస్తూనే ఉంటుంది. అధికార, అనధికార (రాజకీయ) ప్రభుత్వపు ఏజెంట్లు స్వార్థ, నిర్దాక్షిణ్య కరచాలనాల సంకెళ్లలో ఎటూ కదలలేక, కదిలితే ప్రభుత్వపు లాఠీయో, ప్రజానాయకుల ధాటీయో నెత్తిన పడి, అది అక్కడ ఆగక, ఉగ్రవాదుల బాంబుల కంటే ఖచ్చితంగా నట్టింట పేలుతుందని తెలుసు అందరికీ, అందుకే అధికారం, రాజకీయం, కులం, ధనం, లంచం, చట్టం, అనుబంధం, దురాశ...) వంటి ‘లేండ్ మైన్ల’ మధ్య నిరాయుధులై, నిస్సహాయులుగా ఆచి తూచి మాట్లాడుతు, చూసి అడుగులేస్తు నడుస్తున్న తెలుగు ప్రజ చేసే లక్షణమైన పని లేశమైనా వీసెడుగా భావిస్తారు.
అయితే ఈ కష్ట నష్టాలు లేని తెలుగు వాళ్ళే లేరా? తెలుగువారి బాగుకై తామాడే మాట, తాము చేసే చేత తమ మామూలు జీవితానికి ఎటువంటి ఆటంకం కలిగించకపోగా, ఆపైని నాలుగింతలుగా ఉపయోగపడే అవకాశాన్ని కలిగించిన తెలుగువారు లేరా? లేకేం ఉన్నారు. తెలుగునాట మాట అటుంచి, విదేశాలలో ఎందరో ప్రవాసాంధ్రులుగా ఉన్నారు. ఉత్తర అమెరికాలో వేలల్లో ఉన్నారు. లక్షమంది కాబోతున్నారు. మరి మీరు ఎవ్వరినీ లెఖ్ఖ చేయక లక్షణమైన పనులు చేయవచ్చు కదా? మరి చేస్తున్నారా?
‘అమెరికన్ డ్రీమ్’ కై రాత్రనక పగలనక చిత్తశుద్ధితో, చిరునవ్వుతో, మేధని పంచి, విజ్ఞానపు దివ్వెలు వెలిగించి, అమెరికా అభివృద్ధికి అనుక్షణం వెచ్చించి పనిచస్తున్నారు. తమ కలలు నిజం చేసుకుంటున్నారు. ఆ కలలో ఇతరులకి సూది మొన మోపినంత భాగం కూడా లేదు. అప్పుడప్పుడు డబ్బు లెఖ్కలలో తలమున్కలయినప్పుడు, అంతరంగం ‘వింతమాట’ మాటాడినప్పుడు, పేరు ఇచ్చే డాలరు చెక్కు విరాళంతో దానిని బుజ్జగిస్తారు. లేదా కోటి డాలర్ల కోవిళ్ళకు డబ్బులిస్తారు. పాప ప్రక్షాళనం కావించుకుంటారు. ఇది చాలా చాలా మంది చేసేది. అయితే కొంతమంది నిస్వార్థంగా, తమ మనసంతా తెలుగువారి అభివృద్ధికై, లక్షణమైన పనులతో, మేధంతా ఆ పనులు ఆచరణకై వెచ్చిస్తారు.
ఈ రెండు తరగతుల వారిని, వారి మధ్యనున్న వారందరిని కలుపుకొని ‘తెలుగు’ పేరిట ఉత్తర అమెరికాలో సుమారుగా ప్రతిరాష్ట్రంలో ఒకటి రెండు సంఘాలు ఉన్నాయి. ప్రతీ ఏటా తెలుగు సభలు, మిలియన్ డాలర్లకు మించిన ఖర్చుతో జరుగుతాయి. తెలుగు సంస్కృతిని అమెరికాలో నిలబెడుతున్నామని, ఇంగ్లీషులో ఉపన్యాసాలు ఇస్తారు, వ్యాసాలు వ్రాస్తారు. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’తో మొదలుపెట్టి, గతమెంతో ఘనకీర్తి కలవాడా! అనే పాడుకొంటారు.
ఈ తరహా ఆలోచనలకు ఈ వ్యాసం ప్రారంభమే కానీ, సమగ్రమైన సమీక్ష కాదు. నాకు కొద్దిగా పరిచయమున్న ప్రవాసాంధ్రుల పరిస్థితులను చూసి వ్రాసినదే కానీ, ఊహించి వ్రాసినది కాదు. ముందు చూపుతో నిర్భయంగా అడుగు వెయ్యడానికి ప్రవాసాంధ్రులకి అవకాశాలు పుష్కలం. అందుచేత, లక్షమంది కాబోతూ, లక్షణమైన పనులు చెయ్యడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్న వీళ్ళు ఎలా ఉన్నారు? తెలుగు కీర్తి పతాకాన్ని ఎగురవేయడానికి చేస్తున్న దేమిటి? ఈ ప్రశ్నలు, వీటి సమాధానాలు ‘నవ్యాంధ్ర దీప్తి’కి దోహదమవుతాయని, ప్రవాసాంధ్రుల ‘తెలుగు తేజం’ తెలుగు వారందరికి ఉత్తేజాన్ని కలిగిస్తుందని ఆశిద్దాం.

0 వ్యాఖ్యలు:
Post a Comment