చూడనివాళ్ళు
మళ్ళీ మళ్ళీ
దళితులని సృష్టిస్తుంటారు
* * *
కాలం మారినా
కులం మారినా
మనిషి మారని సమాజంలో
దళితులు ఉంటూనే ఉంటారు.
* * *
కులాల పేరిట సంఘాలు
కులాలకోసం కలాలు
జనాన్ని చీల్చే మార్గాలు
నిజాన్ని దాచే వాదాలు
నిన్నటి అన్యాయాలని చేసే స్వార్థపు యజ్ఞంలో
ప్రజ్ఞ సమిధ మళ్ళీ.
* * *
అగ్రవర్ణాలలోని దుర్గుణాలు
అన్ని వర్ణాలలో ఉన్నాయి
అవకాశమున్న వారి
చేతిలో ఆచరణకొస్తాయి
* * *
మనిషిని మనిషిగా
ఏ ‘రిజర్వేషన్’ లేకుండా
చూసే రోజుకై
ఎదురుచూస్తూ....
0 వ్యాఖ్యలు:
Post a Comment