Thursday, May 14, 2009

ఆడదాని నవ్వు

Thursday, May 14, 2009


బాల్యంలో జాగ్రత్తలు
యవ్వనంలో అడ్డుగోడలు
సంసారంలో బాధలు
సగం కంటే ఎక్కువే మోసే
ఆడదాని నవ్వు

మనసిచ్చి, తనువిచ్చి
ధనమిచ్చి మధన పడే,
ఆడదాని నవ్వు

ఏక కణానికి అస్తిత్వమిచ్చి
ఏకంగా రక్తం పంచి ఇచ్చి
నవమాసాలు మోసి
వేదనకోర్చి, వెలికి తెచ్చి
పెంచి పెద్ద చేసి
విసిగించి, వేధించి
అరచి, అవమానపరచినా
‘అమ్మా’ అని
పిలిపించుకునే
ఆడదాని నవ్వు

ఎందరెన్ని విధాల
అవమాన పరిచినా
చాలదన్నట్టు
అత్తగా కోడలిని
కోడలిగా అత్తని
తన్నుతానే అవమానపరుచుకునే
ఆడదాని నవ్వు,

నడుస్తున్న చరిత్రలోని
చెరపలేని నల్ల సిరా మరక




0 వ్యాఖ్యలు: