Thursday, May 14, 2009

మూడోలెఖ్ఖ

Thursday, May 14, 2009
“మా ఇంటిపేరు కండక్టర్ కాదండి. కాని నన్నంతా కండక్టర్ రవణంటారండి. మీ నాయనగారి తొలిబస్సుకి నానే కండక్టర్ నండి తరవాత ఆర్టీసి వొచ్చిందండి ఆర్టీసి కండక్టరయిపోనానండి. కానీ రూటు మారనేదండి. ప్రైవేటైజేషన్ వచ్చిందండి, ఈ రూటు మీరు తీసుకొన్నారుట కదండి, అంచేత వచ్చే కండక్టర్ గా తీసుకొంటారన్న ఆశతో వొచ్చానండి.”

“సరే, మంచి రోజు చూసి మొదలెడతాం. జాయినయిపో”
“పెద్ద మనిసే తవది”
“చూడు, చిల్లరలేదని రోజు వంద మిగల్చేవాడివా?”
“చిత్తం”
“ఇకనుండి రెండొందలు మిగుల్చు”
“ఎందుకండి?”
“ఎందుకేంటిరా, ఎన్ని టిక్కెట్లు కోస్తే అంత టేక్సు కట్టాల్రా. రెండు లెఖ్ఖలు రోజు సరిగ్గా అప్ప చెప్పు!
“చిత్తం”

అయితే మూడు లెఖ్ఖలెయ్యాలన్నమాట ఇకనుండి అనుకొన్నాడు మౌనంగా మనసులో రవణ.



0 వ్యాఖ్యలు: