“ఇండియా ఎలా ఉంది?” అని అడిగిన ప్రతివాళ్ళకూ ఇండియా నుండి తిరిగి వచ్చిన వాళ్ళు ‘చాలా బావుంది’ ‘బాగా ఎంజాయ్ చేసాం! ‘గ్రేట్’ అనో ‘మైగాడ్’,‘ఐడోన్నొ’ అనో ఈ రెండింటికి మధ్యగానో సమాధానాలు ఇస్తూ ఉంటారు. ఎవరు ఎలా అన్నా ఇండియాలో అడుగు పెట్టిన దగ్గర నుండి అడుగడుగునా అక్కడ ప్రజలని ప్రవర్తనలని, పరిస్థితులని ఇక్కడ (అమెరికా)తో పోల్చి చూసుకొంటూ ఉంటాం. ఇక్కడకు తిరిగి వచ్చిన కొద్ది రోజుల దాకా ‘అయ్యో ఇండియాలో ఇదెందుకిలా ఉంది?’ ‘అదెందుకు ఇక్కడిలా లేదు’ అని బుర్రలో వచ్చే ఆలోచనలు మనసును ముల్లుతో గుచ్చినట్లు గుచ్చి మనల్ని కదిలిస్తూ ఉంటాయి. తాపీగా ఆ ‘ఆలోచనలు’ ఆ ‘కదలింపులు’ పోతాయి. ఇక్కడ జీవితంలో ‘హాయిగా’ కలిసిపోతాం. అలా తిరిగి వచ్చి కలిసిపోతూ, మళ్ళీ మళ్ళీ మళ్ళీ, మళ్ళీ వచ్చే వాళ్ళు మనలో ఎంతోమంది. ‘అలా మరిచిపోదాం’ అది ‘సరే’ అని అనుకొండి ఈ వ్యాసం, ఇక్కడతో ఆపి ముందుకు కదలండి. అలా కాకుండా ‘నేనేం చెయ్యగలను?’ అని ఆలోచిస్తున్నా, ఆలోచిద్దాం అనుకొన్నా ఈ వ్యాసం చదివి, మీ అభిప్రాయాలను, ఆలోచనలను ఈ వ్యాసంలోని విషయాలకు జోడించి, మీకు తోచిన, వీలయిన చెయ్యగలిగిన తీరులో ఏదైనా చేసి ఆ ప్రయోగ ఫలితాలను మిగిలిన వాళ్ళతో పంచుకోవడం మొదలుపెడితే ఏ ఒక్కళ్ళు విడివిడిగా చెయ్యలేనంత పని అందరం కలిసి సాధించగలం. మనం నేడు ఇక్కడ ఇలా ఉండడానికి రకరకాలుగా తోడ్పడిన సమాజం అభివృద్ధిలో మన బాధ్యత నిర్వర్తించిన వాళ్ళం అవుతాం అని నా ఉద్దేశ్యం. చుట్టూ ఉన్న చీకటి కళ్ళు మూసుకొని మరచిపోయార నోరారా తిట్టుకొంటూనే కూర్చోకుండా చిన్నదీపం వెలిగిస్తే ఉన్నంతలో మెరుగవుతుంది. ఆ వెలుగు ముందుకు పోవడానికి దారి చూపుతుంది.
ఆంధ్రాని తలచుకోగానే మనకి ముందు గుర్తువచ్చేది జనం, దుమ్ము, పద్ధతిలేని ట్రాఫిక్, ఏపని చెయ్యడానికైనా అడ్డుతగిలే అవినీతి, ఆశ్చర్యపరిచే ధరలు, అమెరికన్ టీ.వీ. ప్రాణములు, ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్యులర్ ఫోనులు.. కొన్ని ప్రగతికి ఇంకొన్ని మనదేశం నిర్భాగ్యతకి నిరక్షరాస్యతకు, ఖచ్ఛితమైన సాక్ష్యాలు ఇవికాక అంతటా వ్యాపించి ఉన్న సామాజిక అసమానత ఈ వ్యాసంలో నిరక్షరాస్యత అసమానత గురించి కొంత ఆలోచిద్దాం.
ఆరుకోట్ల అరవైలక్షల పైబడ్డ ఆంధ్రా జనాభాలో సగానికి సగం మంది అక్షరాస్యులు కారు (45.11 శాతం). అక్షరాల వరుసక్రమంలో మొట్టమొదటిదైన ఆంధ్రరాష్ట్రం అక్షరాస్యతతో కట్టకడపటిది. (25వ స్థానం) లేదా నిరక్షరాస్యతలో మొట్టమొదటిది. ఆంధ్రాలో ప్రాథమిక విద్య బ్రిటిష్ వారి పరిపాలనలో కూడా ఇంత దీనంగా లేదని అప్పటి, ఇప్పటి పరిస్థితులు తెలిసిన వారి అభిప్రాయం. ఇంతటి దీనాతిదీనమైన పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ‘అక్షరాస్యత‘ని మెరుగుపరచడానికి రాష్ట్రంలోని అధికారులు, ఎన్నుకోదగ్గ నాయకులు ఏం చేస్తున్నారన్న దానికంటే, ప్రభుత్వం అందిస్తున్న అశాస్త్రీయ విద్యావిధానంలో అతిపెద్ద డిగ్రీలు పొంది, ఆ విద్య పెట్టుబడిగా అమెరికాలో ఆర్జిస్తున్న మనం ఏం చేస్తున్నాం అన్నది ముఖ్యమైన ప్రశ్న. అక్కడక్కడ కొద్దిమంది వ్యక్తులు కాని (ICP, North-south Foundation, AID) వంటి సంస్థలుకాని చేస్తున్న కృషి తప్పించి అత్యధిక శాతం చేస్తున్నది శూన్యం.
ఇక్కడ ఉండి మనం ఏం చెయ్యవచ్చు అన్న ఆలోచన వస్తే మనం చెయ్యగలిగినది చాలా ఉంది. మొట్టమొదట ఈ నిరక్షరాస్యత సమస్య గురించి వివరంగా తెలుసుకోవడం. ఇప్పటికే అక్షరాస్యత పెంపొందిస్తున్న సంస్థలతో, వ్యక్తులతో సంబంధం ఏర్పరుచుకోవచ్చు. వారి అనుభవాలను, ఆశయాలను పంచుకోవచ్చు. ఉన్నంతలో అక్షరాస్యత పెంపొందించడానికి డబ్బును కాని, కాలాన్ని కాని ఈ సంస్థలకు అందించవచ్చు. ఈ సంస్థలు చేసే కార్యక్రమాలని ఆంధ్రలో మీ ఊర్లో, జిల్లాలో ఇప్పటిదాకా లేకపోతే మొదలుపెట్టడానికి మీరు తగిన వివరాలు తెలిపి, అక్కడ మనుషులతో సంబంధాలను ఏర్పర్చవచ్చు.
మీరు ఇండియా వెళ్ళినపుడు, మీరు చిన్నపుడు చదువుకొన్న స్కూళ్ళకు వెళ్ళి, అక్కడి పరిస్థితులు చూడవచ్చు. ఉపాధ్యాయుల్ని కలిసి స్కూలు, ఆర్థిక స్థితిగతుల మంచి చెడ్డలు మాట్లాడవచ్చు. మీకు తెలియకుండానే మీరు అక్కడ విద్యార్థులకు ‘ఆదర్శప్రాయంగా’ ఉంటారు. విద్యార్థులను కలిసి, వారితో కొద్దిసేపు గడిపి వారిలో ఆత్మవిశ్వాసం, ఏదైనా సాధించాలనే పట్టుదల పెంపొందేటట్లు స్ఫూర్తిదాయకంగా మాట్లాడవచ్చు. మీకు ఆర్థికంగా వీలయినంతలో, విద్యని, నడవడిని, ప్రోత్సాహించే తీరులో బహుమతులను ఏర్పాటు చెయ్యవచ్చు. మీరు ఏర్పాటు చేసిన బహుమతులు అక్కడి వారిని ప్రేరేపించి అణుకువను పెంచే తీరులో పనిచేస్తాయి.
నిరక్షరాస్యతకు మించి మన సామాజిక అభివృద్ధికి, మన జాతి ప్రగతికి అడ్డునిలుస్తున్నది మనలో ఉన్న ‘సామాజిక అసమానత’. చిన్నప్పటి బడిలో అందరం కలిసి ఆడుకోడం అందరికీ గుర్తే. కాని పెరుగుతున్న కొద్ది, చదువు ఎక్కువవుతున్నకొద్ది, ప్రతిక్షణం, మనకి తెలియకుండా, మనచేత ‘అసమానత’ అడ్డుగోడలని సమాజం కట్టిస్తూ ఉంటుంది. కులం, సంప్రదాయం, విద్య, ఉద్యోగం, డబ్బు ఈ అడ్డుగోడలకి తగిన బలాన్ని ఇస్తున్నాయి. ఈ ఇరుకు అడ్డుగోడల మధ్య నలిగిపోతూ మనం ఇతరులు నలిగిపోయేటట్లు చేస్తుంటాం. అది సామాజిక స్వరూపం అని అనుకొంటూ సర్దుకుపోతుంటాం. ఇక్కడ, అమెరికాలో, ఈ అడ్డుగోడలు అక్కడికంటే తక్కువే. అయినా అపుడపుడు అడ్డుగోడల మధ్య ఇరుక్కొన్నపుడు ‘ఛీ!ఇదెంత అమానుషం’ అని అనుకోవచ్చు. కాని కొద్దిగా ఆలోచించి చూస్తే అందరం అందుకు దోహదం చేస్తున్న వాళ్ళమే అన్న సత్యం తెలుస్తుంది.
ఈ అసమానతలని ఆపడం ఎలా? అన్న ప్రశ్నకు సూటియైన సరళమైన జవాబు లేదు. అందరం ఈ అసమానతల స్వరూపం గురించి ఆలోచించడం మనం చెయ్యగల్గిన మొట్టమొదటి పని. ఇండియాలో ఈ అసమానతల ప్రభావం, అడ్డుగోడలుగా కనిపిస్తూ ఇక్కడనుండి వెళ్ళినవాళ్ళకు ముందుగా వింతగా తర్వాత మామూలుగా అనిపిస్తాయి. అక్కడ వాళ్ళకు అది జీవన విధానంగా తెస్తుంది. అందుచేత ఇండియా వెళ్ళినపుడు, అక్కడవాళ్ళు సాధారణంగా కూలివాళ్ళని, డ్రయివర్లని, ఇంట్లో పనివాళ్ళని ఎంత దూరంలో ఉంచి చూచినా, ఎంత భేదం చూపించినా మనం మాత్రం ఆ దూరాన్ని, భేదాన్ని తగ్గించి, వాళ్ళని వీలయినంత గౌరవంగా, చేతనైనంత సమానత్వం, వాళ్ళ గుణం ప్రధానం చేసుకొని, వాళ్ళ ఆర్థిక స్థోమత, కులం విస్మరించి ‘అసమానత’ అడ్డుగోడలని తగ్గించడానికి ప్రయత్నించవచ్చు. మీరు హోటల్కో, సినిమాకో వెళితే మీతోపాటు డ్రయివర్ని, ఇంట్లో పనివాళ్ళని కూడా తీసుకెళ్ళవచ్చు. అక్కడ మీ బంధువుల స్నేహితుల, పనివాళ్ళు మీకు కూడా ఏమైనా పనులు చేసిపెడితే వాళ్ళతో ఒకటి రెండు మాట్లాడి, తగిన పారితోషికం ఇవ్వవచ్చు. వీరు ప్రవర్తించే తీరు మీ స్నేహితులని, బంధువులని ప్రభావితం చేయ్యవచ్చు. మీ చిన్నప్పటి పాతరోజులలో పనిమనుషులు కొంతమంది చూపించినంత అభిమానం మీ బంధువులలో చాలామంది చూపించరండీ. ఆశ్చర్యం, అనిపిస్తుందా మీకు, అసమానతల అడ్డుగోడల ఆవలికి ఒక్కసారి తొంగి చూడగలిగితే నేను చెప్పిన దానిలో నిజం తెలుస్తుంది.
(అసమానతల అడ్డుగోడల కంటే ఎత్తుగా ఎదగవచ్చునని నిరూపించిన మా తాతగారు శ్రీ అయ్యగారి నారాయణమూర్తిగారికి, అస్తమానం రాయిమని ప్రేరేపించే శ్రీనరిపల్లి కనకప్రసాద్ గారికి కృతజ్ఞతలు)

- తానా 1997 సావనీరు
0 వ్యాఖ్యలు:
Post a Comment