
ఇక్కడ నేడింకా
అందమైన ఆడపిల్లలు
కట్నం దాహం తీరని
నల్లభాస్కరుల వల్ల
అమంగళమైన
మంగళసూత్రాల వల్ల
సంసారం రాటకి
కట్టబడి
బురదనీళ్ళవంటి
వలపుతో
సలుపుతో
సంసారాలు సాగిస్తున్నారు
తమకు తామే
కాలిపోతున్నామని
కూడా తెలియని
సుజాతలు
ఇక్కడ కిళ్ళీ బడ్డీల దగ్గర
సిగరెట్టు కాల్చుకొనే
కొబ్బరి తాళ్ళలా
ఇంటింటా వేళ్ళాడుతున్నారు
అప్పారావు తాతగారి
గొప్పాశలు
మురికి కాలువల్లో కొట్టుకుపోతున్నాయి
చలం బాబయ్య
గుండెల్లో రగిలిన
మంటలు వెలుతురుతో
నాకు ఈ నడిరాత్రి
పట్టపగల్లా ఉంది
నా భారతి ఎన్ని కన్నీళ్ళు కారుస్తుందో?
ఏ అర్చన దీనికి మంగళం పాడుతుందో?
0 వ్యాఖ్యలు:
Post a Comment