I
(అమెరికాలో తెలుగు బ్రహ్మచారుల అపార్ట్ మెంట్ ఫోను వగైరాలు...
ఒకడు అటు ఇటు తిరుగుతుంటాడు (మొదటివాడు). ఇద్దరు (పెళ్లికొడుకు, రెండోవాడు) కూర్చుని ఉంటారు.)
మొదటివాడు: (హైదరాబాదీ భాష. యాసతో తెలుగుమాట)
అసలు నీకేమైందివయ్య. ఇండియా పోయినావ్. 16 మందిని పెండ్లి చూపుల్ చూసినావ్. సక్కగ పూలరంగడి లెక్క ఉండక. ఈ పరేషానీ ఏందిబయ్ నువ్వట్టా. మేమిట్టా...
రెండోవాడు: (నెల్లూరు భాష, యాసతో తెలుగుమాట)
అంతే కాదయ్యో, చిన్న పిలకాయల మాదిరీ కోపం తెచ్చుకుంటాడు. లెఖ్కలయ్యొరి మాదిరి తిక్కతిక్కగా చూస్తాడు. గత వారంలో రెండు తూర్లు రైడ్ ఇవ్వకుండనే పోయినాడు. ఏమివయ్యా ఒకే కంపెనీ పోవాలి కదా, దుడ్డు పెట్టి కారు నేను కొంటా, పెట్రోలు పోయించవయ్యా, దినాము రైడిస్తా, సక్కగా పోదామంటివి, వారంలో రెండు తూర్ల వదిలిపోతే ఎట్లానయ్యా? భగమంతుడా నీ బస్సులు మారి గంట లేటుగా కంపెనీ చేరేది. మిడిగుడ్లేసి మోనికా మనకేసి చూసేది. (అవమానం అన్నట్లు మొహం పక్కకి తిప్పుకొంటాడు)
మొదటివాడు: ఇగ ఏపార్ట్మెంట్ల నాస్త సరిగ చేస్తలేవ్. టీవీ చూస్తలేవ్. ఇండియా ఫోన్ చేస్తలేవ్. నెల్లూర్ల లేనే లేదీ న్యూయార్కంటూ పరేశానయ్యే (అమాయకం వాడిని) ఎందుకు సతాయిస్తావయ్యా? నేన్ స్టాకుల్లో బిజీ. మరిప్పుడు World trade center పొయె, అమెరికా అదిరిపోయె. Stock exchange మూసుకుపోయె. ఇక మరి ఏమి చెయ్యాల. ఎపార్ట్మెంట్ లోనే దినాము బేకార్గా ఉన్నా. చూసినా, చూసినా నిన్ను చూసినా. నిన్ను చూస్తా ఉంటే Friend గదా, problem ఎందో తెలుసుకొని, solution ఇయ్యాలె, ఇయ్యాలె అని నిశ్చయించుకున్నా భాయ్. సంగతేంది?
(నిశ్శబ్దం)
(రెండోవాడు: ఏపార్ట్మెంట్ లోనే కాదు, అయ్యోరు ఆఫీసులో కూడా ఇలానే. బిల్ సారు నేను ఈయన discussion చేస్తా ఉన్నాం. ఈయన అట్టకాదు అని ఆయన్ని ఆపి, program specification లో problems చెప్పుకు పోతా ఉంటే, బిల్ సారు సానా మరియాదగా, ఏమన్నాడబ్బా, ఆ... Just a మినుతె
పెళ్లికొడుకు : ఏంటీ Just a minute. Don’t want to hear… (అని ఆవేశంతో పేళ్ళికొడుకు లేస్తాడు. రెండోవాడి వైపు వెళ్ళబోతుంటాడు మొదటివాడు ఆపుతాడు.
మొదటివాడు: రెండోవాడు: (కొంచెం భయంగా) అదివయ్యా, Just a minute అంట సారు ఆవేశపడిపోతాడు. ఇంతకుముందు రెండుమూడు తూర్లు ఇలానే జరిగింది. Just a minute అంటే..
II
(పెళ్లికొడుకు కదులుతాడు. రెండోవాడి వైపు వెళ్ళబోతుంటాడు. మొదటివాడు ఆపుతాడు)
మొదటివాడు: రెండోవాడు: (పెళ్ళికొడుకుని కుర్చీలో కూర్చోపెట్టి, మోకాళ్లమీద ఉండి...) ఏం జరిగిందో చెప్పు భాయ్. ఇక అమెరికాలో అరనిమిషం ముందు కలిసినవాడే దోస్తు. ఆరు నెలలుగా కలిసుంటన్నరాడే గదేంది, ఆత్మబంధు, చెప్పుభాయ్....చెప్పు.
(పెళ్లి చూపుల ఏర్పాటు. పెళ్లి కొడకు (Scene 1) రెండు జంటలు (తల్లిదండ్రులు – అక్కాబావా). పెళ్లి కూతురు, రెండు జంటలు (తల్లిదండ్రులు – అమ్మమ్మ).
పెళ్ళికొడుకు బావ: పెళ్లి చూపుల పెళ్లికొడకా, ఇది పదహారవది ఈ మారు ఇండియా వచ్చిన 20 రోజులకి. మళ్ళీ ఎల్లుండే నీ అమెరికా ప్రయాణం. మీ అమ్మా నాన్న సంగతేమో గానీ, ఈమారూ నువ్వు పిల్లని నచ్చుకోకపోతే మళ్ళీ ఆరునెలల్లో రావడం, నేను సర్వ అబద్ధాలు ఆడి సెలవు పెట్టడం, మనం మళ్ళీ మరో పదహారు పెళ్ళి చూపులకు తిరగడం తప్పదా నాయినా. మమ్మల్ని కరుణించి ఈ పిల్లని నచ్చుకో నాయినా. నేను నచ్చుకోలేదా మీ అక్కని. అలాగే...
పెళ్లికొడుకు అక్క: ఏం నాకేంతక్కువుందని, మెడిసిన్ చదివి, IAS చేసి, అమెరికా వెళదామనుకున్నదాన్ని, నచ్చింది, నచ్చిందని వెంటబడి మరీ చేసుకున్నారు నేను కాక మావాళ్ళు ఇచ్చిన కట్నం నచ్చింది కాబోలు. (రుసరుస...)
పెళ్లికొడుకు తండ్రి : మర్యాద, మర్యాద...
పెళ్లికొడుకు తల్లి : మీరూరుకోండి, మీకేం తెలీదు. అదికాదండీ అల్లుడుగారు, మీరు వాడిని నచ్చుకోమని బలవంత పెట్టకండి అప్పుడేను, మనం మగ పెళ్లివారిమి, కట్నకానుకల విషయం మాట్లాడుకోవాలి కదా. ఈలోగా నువ్వు అమ్మాయిని చూస్తుండరా.
పెళ్ళికూతురి తాత : ఆ విషయంలో మీ ఉద్దేశం ఒక ముక్కగా మీరే చెప్పడం సాంప్రదాయం. మా అల్లుడు, కూతురూ తాహతున్న వాళ్ళే.
(పెళ్లికూతురి తల్లిదండ్రులు దీనంగా చూస్తుంటారు)
తల్లి : మావాడికి ఇంజినీర్లో సీటురాగానే 5 లక్షలిస్తామని ఇంటిచుట్టూ తిరిగారు. ఉండవే, ఇంకా ఆగితే ఇంకా వస్తుంది అని ఈయన ఆపీసారు. గేటో ఏంటే అందులో 700 రేంక్ వస్తే 7 లక్షలిస్తామని వచ్చారు. అమెరికా వెల్లనీవే అని మళ్లీ ఆపీసారు. విమానం ఎక్కకముందే 10 లక్షలిస్తామన్నారు. అక్కడ అమెరికాలో IIT, మన మద్రాసూ, బొంబాయి లాంటిది కాదు, దాని పేరేటండీ, (అంటూ చెప్పమని భర్తని పొడుస్తుంది.)
పెళ్లికొడుకు తండ్రి : IIIinoi institute of Technology…
తల్లి : ఆ అదే చాలా పెద్ద అమెరికాలో, అందులో MS చేసాడు. పైగా ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు. నెలకే లక్షలు లక్షలు జీతం. అలాంటి వాడికి ఎన్ని లక్షలిస్తే మాత్రం ఏం నష్టం. అంతా మీ అమ్మాయికే లాభం.
బావ : మిమ్మల్ని ‘ఇది కట్నం’ అని ఒక సంఖ్య అనుకుంటున్నారు. అనండి.
తల్లి : నేనలా అనలేను బాబు, ఏబ్రాసిలా. మొన్న చూసిన సంబంధంవాళ్లు నిన్న కబురెడతా, 18 లక్షలు ఇస్తామని.
అక్క : అదేవిటే అమ్మా, నువ్వు ఆడబడుచు లాంఛనాల సంగతి మరిచిపోయావా? 2 లక్షలు ఇస్తామన్నారు కదుటే?
బావ: మా అక్క నా పెళ్లిలో స్టీలు బిందె అడిగిందని నానా గోల చేసేరు. ఇప్పుడు నువ్వు డైరెక్టుగా రెండు లక్షలుకే ప్లాన్ వేసేవే. (మెల్లిగా) అంతా కాష్ అయితే బెటర్ తెలుసా.
(అత్తగారివైపుకు తిరిగి) పోనీ ఒక 20 లక్షలు లాంఛనాలు 2 లక్షలకి తగ్గకుండా అని ఓ ముక్క అనీసీదా! (ఆనందంతో)
తల్లి : ఆడదాన్ని నాకేం తెలుసు. మీ ఇష్టం. (అని పెళ్ళికొడుకు తండ్రి వైపు చూస్తుంది)
పెళ్ళికొడుకు తండ్రి మౌనంగా తల ఊపుతాడు.)
బావ : మీ అదృష్టం బావుంది. ఒక 20 లక్షలు లాంఛనాలు 2 లక్షలకి తగ్గకుండా.
(పెళ్ళి కూతురు తల్లి తండ్రి అంతా అన్నట్లు చూస్తారు).
(10 సెకెండ్లు నిశ్శబ్దం)
తాత : ఏం మా అల్లుడంత లేనివాడేం కాదు. బాగా సంపాదించినవాడే, కట్నం ద్వారా !
పెళ్లికూతురి అమ్మమ్మ : ఒక్కగానొక్క కూతురు, అరణం ఇచ్చిన ఆరెకరాలు అమ్మి అయినా ఇవ్వగలరు. పెళ్లి ఘనంగా చెయ్యగలరు.
పెళ్ళికూతురి తల్లి : అమ్మా...
పెళ్ళికూతురి తండ్రి : అత్తగారూ...
అమ్మమ్మ : మరేం గాభరా లేదు. ఉన్నదంతా అమ్మి అయినా ఈ సంబంధం ఖాయం చేసేయండి. తాంబూలాలు పుచ్చేసుకోండి. మేం మాత్రం మా తంటాలు మేం పడలేదు 25 ఏళ్ళ క్రిందట నీ పెళ్ళికి. ఇప్పుడు మీవంతు పడండి. ఆడప్లిలని కన్నందుకు ఆమాత్రం పడొద్దూ.
పెళ్ళికూతురి తల్లి : అమ్మా...
పెళ్ళికూతురి తండ్రి : అత్తగారు...
బావ : మీరు మీరు తరవాత మాట్లాడుకోవచ్చు. ముందు కట్నం విషయం తేల్చేయండి. ఒక పనయిపోతుంది.
అక్క : మీరు మరీను. మీకు సరీగా మాట్లాడడం బొత్తిగా రాదు. కట్నం అని ఊరుకుంటే చాలదు కట్నం 20 లక్షలు. ఆడబొడుచు లాంఛనాలు 2 లక్షలకి తగ్గకుండా, పెళ్లికి మావైపునుండి వచ్చే 500 మందికి 5 స్టార్ హోటల్ నుండి భోజనం, కాఫీ టిఫిను, కార్లు...
తాత : అవన్నీ మా అల్లుడికి చెప్పాలా, పెళ్ళిలో ఏర్పాట్లన్నీ ఘనంగా చేయిస్తాడు. ఘనంగా లేకపోతే ఆయనకి నచ్చదు. కోపం వస్తుంది, కదండీ! (అని అల్లుడివైపు చూస్తాడు) ఆయన పెళ్ళిలో బాజావాళ్లు సరిగ్గా వాయించలేదని, సరియైన ఏర్పాటు చేయలేదని, కోపం వచ్చి, పెళ్ళే మానుకొంటనన్నారు. అలాంటి వారికి మీరు ఘనంగా పెళ్ళి చెయ్యమని చెప్పాలా.
పెళ్ళికూతురి తల్లి : అమ్మా...
పెళ్ళికూతురి తండ్రి : అత్తగారూ...
అక్క : మీరిన్ని మాటలంటున్నారు కానీ, అనవలసిన వాళ్ళు, వినవలసిన వాళ్ళు వినేటట్టు ఒక్కసారి సారె, చీరె, నా లాంఛనంతో సహా కట్నం ఎంతివ్వగలిగేది వివరంగా, ఖచ్చితంగా అంటే బావుంటుంది కదా!
తాత : సరే అని అనండి అల్లుడుగారు. అమెరికా సంబంధం. అబ్బాయి అమెరికా IIT. అమెరికాలో ఉద్యోగం. డాలర్లలో జీతం. అమ్మాయికి ఇంద్రభోగం!!!
తల్లి : మీరు సరిగ్గా చెప్పేరు మామయ్యగారు. అమ్మాయికి అంత అదృష్టం పట్టబోతూంటే, ఈ కట్నం ఒక లెఖ్ఖా!
బావ : మావాడితో పెళ్లి చూపులకి వెళ్ళడం ఇది 48వ సారి గత రెండేళ్ళలో. వాడిని అడగఖ్ఖర్లేకుండానే, వాడి మొహంలోకి చూసి అమ్మాయి ఎంత శాతం నచ్చిందో చెప్పడంలో నాకు చాలా అనుభవం. దాని ప్రకారం ఈ అమ్మాయి మా వాడికి 100 శాతం నచ్చింది. కదువోయ్. (అంటూ పెళ్లికొడుకు గడ్డం ఎత్తి మొహంలో మొహం పెట్టి అడుగుతాడు.)
అక్క : అందరిముందు వాడిని అలా అడిగి ఇబ్బంది పెడతారేంటండి. మాట్లాడుకోవలసినవి సరిగ్గా ముఖాముఖీగా మాట్లాడుకుంటే చాలు ఇక్కడ. ఇంటికి వెళ్లింతరవాత ఆలోచించి ఫోను చేస్తాం అని చెప్పండి. ఇప్పుడే నచ్చింది, గిచ్చింది అంటే లోకువయిపోతాం. ఎలాగో పిల్ల నచ్చింది కదా అని కట్నం విషయంలో బేరాలకు దిగుతారు అవతలి వాళ్ళు.
బావ : సరే మీ అక్క ముచ్చట తీరి 48 మాటు కూడా మాట్లాడుకోవలసినవి సరిగ్గా ముఖాముఖీగా మాట్లాడుకుంటాం. నువ్వు అమ్మాయితో వేరే గదిలో వేరే విషయాలు వివరంగా మాట్లాడుకొని, అమ్మాయిగురించి ఒక అభిప్రాయం ఏర్పర్చుకోవోయి. అమ్మాయి పేరు మాత్రమే కాదు నెంబరు 48 అని గుర్తుంచుకో. లేకపోతే తరవాత లేనిపోని confusion.
తల్లి : మా అల్లుడుగారికి హాస్యం ఎక్కువ.
పెళ్ళికొడుకు: మీకన్నీ నచ్చితే, నాకు నచ్చినట్లేనే అమ్మా.
(పెళ్ళికూతురు తల ఎత్తి చూస్తుంది. పెళ్ళికొడుకు తల్లి కొంగు పట్టుకుని తల్లివైపు చూస్తుంటాడు.)
బావ: శుభం. అత్తగారు మీరింక చిట్టా విప్పకండి. మీ కండీషన్లన్నీ నాకు కంఠత వచ్చు. అప్పచెప్పేస్తాను. 20 లక్షల కట్నం. ఒప్పుకున్నట్లేనా (పెళ్ళికూతురు తల్లితండ్రులవైపు చూసి, వాళ్లు బుర్రూపుతారు) సరే ఇది వప్పుకున్నట్లే (పెళ్ళికొడుకు తల్లితండ్రులవైపు చూసి, వాళ్లు ఆనందంగా సరే అన్నట్లు చిరునవ్వు నవ్వుతారు) ఘనంగా పెళ్ళి చెయ్యాలి. (ముందులాగే బావ రెండువైపులవారిని చూస్తాడు) సారె, చీరెలలు మా ఆచార ప్రకారం మావైపు పెద్దలందరికీ అంటే 25 మందికి పెట్టాలి (ముందులాగే బావ రెండు వైపులవారిని చూస్తాడు).
అక్క: ఆడబడుచులం ..
బావ: ఆఆ.. ఆడబడుచు లాంఛనాలు 2 లక్షలకు తగ్గకుండా ఉండాలి. మిగిలినవి ఎప్పుడు, ఎక్కడ ఎలా చెయ్యాలి అన్నది మీకు వివరంగా తెలియపరుస్తాం. మీరు ఆరునెల్లో డబ్బు, గిబ్బు సిద్ధం చేసుకుంటే మావాడు అమెరికా నుండి తిరిగివచ్చి, పెళ్ళిచేసుకొని, హానీమూన్ – ఈ ఖర్చు మీదేనండోయ్. తరవాత అమెరికా అమ్మాయినీ తీసుకొని వెళ్లిపోతాడు – ఈ ఖర్చు మీదేనండోయ్. సరేనా. సరే అంటే సరి. ఈ సంబంధం నిశ్చయం అయిపోయినట్లే. హమ్మయ్యా, అని కుర్చీలో కూలబడతాడు.
పెళ్ళికూతురు : (లేచి నిలబడి stage మధ్యకి వచ్చి) Just a minute.
అందరూ : ఆ...
పెళ్ళికూతురు: మీరు ఎలాగైతే కాబోయే పెళ్ళికొడుకు ప్రతి qualification కి విలువ కట్టేరో అలాగే పెళ్ళి అయిన తరవాత చేయబోయే తప్పులకీ కూడా ఓ penalty plan ఒకటి ముందుగానే రాసుకుంటే బావుంటుంది. ప్రతిదానికి కోర్టులకి వెళ్ళడం అనవసరం కదా.
పెళ్ళికూతురి తరఫువాళ్ళు: ఊరుకో, ఊరుకో...
పెళ్ళికూతురు: నేను చెప్పేది మీరంతా విన్న తరువాత నేనూరుకునే ఉంటాను. కాబోయే అన్నయ్యగారు ఈ లెఖ్ఖలు కూడా మీరే వేస్తే బావుంటుంది. వెయ్యరూ, ప్లీజ్.
బావ: ఆ అలాగే.. కానీ..
పెళ్ళికూతురు: ఇంత కట్నం తీసుకొని అమెరికా వెళ్ళిన తరవాత, ఛీ ఛీ అదేవిటలా, చాదస్తపు ఇండియన్ డ్రస్సు నువ్వు, మోడ్రన్ గా తయారవ్వలేవు, అమ్మమ్మ వేషాలు మాని స్టైల్ గా తయారవ్వలేవా? నిన్ను పార్టీలకు తీసుకువెళ్ళాలంటే సిగ్గుగా ఉంటుంది. అంటూ తిట్టి మా గంగా వాళ్ళాయనలా ఇంట్లో కూర్చోపెడితే నెలకు 1,000 డాలర్లు ఫైను కట్టాలి. ప్రవర్తన మూడునెలల్లో మారకపోతే విడాకులే. 50,000 డాలర్లు పెళ్ళి చేసుకు సరిగా చూడక విడాకుల దాకా తీసుకు వచ్చినందుకు నష్టపరిహారం చెల్లించాలి. కోర్టులంట తిరగఖ్కర్లేకుండానే విడాకులకి కావలసిన సంతకాలు పెట్టి ఇచ్చేస్తాము. (అని బావ వైపు తిరిగి రాసుకోండి.)
బావ: మొత్తం 53000 డాలర్లు రాసుకోమంటారా, లేక 50,000 వేలేనా.
పెళ్ళికూతురు: 53,౦౦౦
(బావ జేబులోంచి పెన్ను కాగితం తీసి వ్రాసుకుంటాడు)
పెళ్ళికూతురు : ఇంతకట్నం తీసుకొని అమెరికా వెళ్ళిన తరవాత మా యమునా వాళ్ళాయనలా పనిమనిషి, వంటమనిషిలా మాత్రమే చూసుకుంటే నెలకు 2,000 డాలర్లు ఫైను కట్టాలి. ప్రవర్తన మూడు నెలల్లో మారకపోతే విడాకులే 50,000 డాలర్లు నష్టపరిహారం చెల్లించాలి. (అని బావ వైపు తిరిగి) రాసుకున్నారా.
బావ: రాసుకున్నాను 56,౦౦౦
పెళ్ళికూతురు: కావేరి వాళ్ళాయనలా ప్రతిదానికి తిట్టడం, చీటికి మాటికి కొట్టడం లాంటివి చేస్తే, నెలకు 5,000 మిగతాది మామూలే.
బావ: అంటే ప్రవర్తన మూడునెలల్లో మారకపోతే విడాకులే 50,000 డాలర్లు నష్టపరిహారం చెల్లించాలి. మొత్తం 65,000
పెళ్ళికూతురు : అమెరికా వెళ్ళిన తరవాత మా సింధు వాళ్ళాయినలా నాకు వేరే ఒక అమ్మాయితో పరిచయం ఉంది. మా అమ్మానాన్నల కోసం నిన్ను చేసుకున్నాను. ఇక నీదారి నువ్వు చూసుకో, నీకు నెలకి ఇంత ఇస్తాను అంటే కుదరదు. మొత్తం 100,000 డాలర్లు నష్టపరిహారం చెల్లించాలి.
తల్లి : అవ్వ, అవ్వ... ఏం విడ్డూరం.. ఏం విడ్డూరం..
పెళ్ళికూతురు: వేరే ఇతర కారణాలవల్ల మా నర్మదా వాళ్ళాయినలా నన్ను వదిలేస్తే 75,000 డాలర్లు నష్టపరిహారం చెల్లించాలి. నేనే మిమ్మల్ని వదిలేస్తే మాకిచ్చిన కట్నం నిక్షేపంగా ఉంచుకోవచ్చు. ఏది ఏమైనా మా గోదావరి, వాళ్ళ ఆయనలా మనం కోర్టులలో కొట్టుకోనవసరం లేదు. సరేనా?
అక్క: శుభమా అని పెళ్ళి చూపులకని వస్తే విడాకులు, నష్టపరిహారాలు, కోర్టులు ఏవిటో అమ్మా? (ఏడుపులాంటి రాగంతో, బావ వైపు తిరిగి) గొప్ప సంబంధం తీసుకు వచ్చారు. లేవండే అమ్మా, (అని లేచి నిలబడుతుంది..)
తల్లి : సంప్రదాయమైన సంబంధం అని వస్తే...
పెళ్ళికూతురు: మన సంప్రదాయంలో స్త్రీ ధనమే తప్ప వరకట్నం లేదండి. మరి కట్నం సంప్రదాయంకాదు. హిందూ ధర్మంలో వివాహం అంటే జీవితాంతం. అంతేకానీ మావాడికి విడాకులిచ్చీ, మొగవాడు కాబట్టి మళ్ళీ మళ్ళీ పెళ్ళి చేస్తాం అని అనకూడదండీ. కానీ చాలామంది ఇదే అంటారుకదండీ.
పెళ్ళికొడుకు తండ్రి : అది చట్టపరమైనదే...
పెళ్ళికూతురు: క్రిష్టియన్లను చూసి మనం తెచ్చి పెట్టుకున్న చట్టం అయితే, ఇంతింత కట్నాలు ఇచ్చిపుచ్చుకున్నప్పుడు పెళ్ళి కూతురి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని, ముస్లిమ్ లలో ఉన్న ఓ మంచి ఆచారాన్ని మనం తెచ్చిపెట్టుకుంటే తప్పేమిటి?
పెళ్ళికూతురి తల్లి : అయ్యో, అమెరికా సంబంధమే, ఇలా చేసేవేమిటే.
పెళ్లికూతురి తండ్రి : ఏదోలా చేసి ఆ డబ్బు తెచ్చి పెళ్ళి చేసేవాడిని కదే. నా పరువిలా తియ్యాలా?
పెళ్ళికూతురు: తరతరాలుగా, మాట్లాడకుండా, నోరుమూసుకు కూర్చోబెట్టే ముచ్చటగా మూడుముళ్ళు వేయించుకుని అమెరికాలో అడుగు పెట్టిన మూడు నెలలోగానే, గంగ, యమున, కావేరి, సింధు, నర్మద, గోదారి లా కోర్టులలో నలుగురి ముందూ చెప్పుకోడానికి కూడా వీలులేని ‘ఆడదానివే కాదు’ లాంటి అభియోగాలతో, అవమానంతో నిస్సహాయంగా విడాకులిచ్చి ఎవరెవరి కాళ్ళో పట్టుకుంటూ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ, ఆ పంచ, ఈ పంచ శణార్ధిలా రోజులు గడపవలసి వస్తుంది.
పెళ్ళికొడుకు తండ్రి: అంతలేసి అపనమ్మకంతో జీవితం మొదలు పెట్టకూడదమ్మా...
పెళ్ళికూతురు: మా నాన్న తన తాహతు కొద్ది కట్నం, వీలయినంతలో ఘనంగా పెళ్ళి చేస్తారన్న నమ్మకం లేక మీవాళ్ళు బేరాలు మొదలు పెట్టారండి. నేను ఊహించిన వన్నీ జరగవని నమ్మకం మీకుంటే, మీ అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలనే ఉందండి.
(అలా కళ్ళప్పగించి చూస్తున్న పెళ్ళికొడుకు భుజం పట్టుకుని లేపి తీసుకెళుతుంది తల్లి. పెళ్ళి కొడుకు వెనకకి తిరిగి చూస్తుంటాడు)
ఈఈఈ
(అమెరికాలో తెలుగు బ్రహ్మచారుల ఏపార్ట్మెంట్, ఫోను వగైరాలు..., పెళ్ళికొడుకు, మొదటివాడు, రెండోవాడు కూర్చోని ఉంటారు. మొదటివాడు, రెండోవాడు లేస్తూ.)
మొదటివాడు, రెండోవాడు: అదా సంగతి. (అని అటు ఇటు తిరుగుతాడు)
రెండోవాడు: మాంచాల మల్లమ్మ మాదిరీ ఉంది సామీ ఈమె.
మొదటివాడు: మరి గట్లుంటేనే, మజా భాయ్, సినిమా హీరోయిన్ల బొమ్మల మల్లే ఉంటే అంతా బోరే భాయ్.
పెళ్ళికొడుకు: మరి, మా అమ్మ సంప్రదాయం...
మొదటివాడు: మన పురాణాలు, భారతాలు పూరా చదవనోళ్ళే అట్లా అంటారు భాయ్.
రెండోవాడు: ఆ పద్యాలు ఎవురైనా చదివితే వినడానికి బుద్ధవుతుంది గానీ, అర్థమవదు సామీ.
మొదటివాడు: దాశరథి రంగాచారి సారు మొత్తం రామాయణం, భారతం, వేదాల్ గీదాల్ మంచిగా తెలుగులో రాసిండు, పొయి చదువ్. పూర అర్థమైతది. కాదంటావ్ వెబ్ల సానా ఉంది. Just a minute చేసి చూసుకో.
రెండోవాడు: అది సరే, ఈ సారు సంగతేమికావాలా బగవంతుడా...
మొదటివాడు: ఎమివాయ్, నీపరేషానేది. ఆ పోరి నచ్చకపోతే పోయే. మరొకరిని చూడరాదా.
పెళ్ళికొడుకు: చూడాలని లేదు
మొదటివాడు: ఎందుకు:
పెళ్ళికొడుకు: ఆ పిల్లే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాది
రెండోవాడు: ఆమె నచ్చిందిలా ఉంది సామీ, అదే గమ్మత్తు
మొదటివాడు: అయితే వెంటనే ఫోను చేసి చెప్పే. ఆ Just a minute పోరి మంచిగా నచ్చిందని.
పెళ్ళికొడుకు: ఎలా చెప్పను, ఎవరికి చెప్పను
రెండోవాడు: ముందా పిల్లకి చెప్పడం దరమం సామి
మొదటివాడు: ఆ తరవాత మీ వాళ్ళకి చెప్పే, అన్ని కండీషన్లకి agree అయి పెళ్ళికి రెడీ
పెళ్ళికొడుకు: నేను నేనా...
మొదటివాడు: సరే ఫో, నేచెప్తా
రెండోవాడు: అది దరమం కాదు సామి, ఆయన పెళ్ళి, ఆయన పెండ్లాము... నువ్వే చెప్పాల సామి. (పెళ్ళికొడుకు ఫోను తీసి, డయల్ చేసి)
పెళ్ళికొడుకు: మీరు నాకు నచ్చారు. (అని ఫోను పెట్టేస్తాడు. వెంటనే డయల్ చేసి) బావా, పెళ్ళి చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటాను.
బావ : ఏ పిల్ల?
పెళ్ళి కొడుకు: number 48, Just a minute.

0 వ్యాఖ్యలు:
Post a Comment