Thursday, May 14, 2009

తెలుగు తనంతో పెళ్ళి

Thursday, May 14, 2009
ప్రవాసంలో తెలుగువారికి
ప్రతి ఫంక్షన్ లో తెలుగుతనంతో పెళ్ళి

ఇష్టపడి వచ్చే వారే వధూవరులు
కష్టపడి పనిచేసే సంఘం ట్రష్టీలే పెద్దలు

పబ్లిక్ స్కూళ్ళే పెంపుళ్ళే పెళ్ళి పందిర్లు
చుట్టూ కనిపించే చిరునవ్వులే తోరణాలు

మెంబర్ షిప్ పైకమే మంగళసూత్రం
కలిసి కలబోసి చెప్పుకొనే కబుర్లే కట్నం

అభిరుచులు కలిసి సర్వం మరిచే క్షణం
జీలకర్రా బెల్లం ముహూర్తం
తమకి తెలియని తమ ఊరి వ్యక్తి
తగిలి తలపింపచేసే తమ ఊరి చిత్రాలే తలంబ్రాలు

ఈ సామూహిక చిత్రం శోభాయమానం
పులకింతలు పెర్ మినిడే కొలమానం
అందుకొన్న అమెరికన్ డ్రీమ్ కి
శోభతెచ్చే అలంకారం తెలుగుతనం




0 వ్యాఖ్యలు: